కల్లూరు అర్బన్ 31వ వార్డు రాఘవేంద్ర నగర్ రోడ్డుపై పేరుకుపోయిన చెత్తకుప్పలపై గురువారం సీపీఎం న్యూ సిటీ నాయకుడు జి. యేసు రాజు ఆందోళన వ్యక్తం చేశారు. కాలినవాసులైన ఖాదర్ బాషా, వంశీ, కిషోర్ తదితరులతో కలిసి సంబంధిత అధికారులకు సమాచారమిచ్చారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని తెలియజేశారు. వెంటనే చెత్తను వెంటనే తొలగించాలంటూ అధికారులను కోరారు.