కల్లూరు మండలం 35వ వార్డులో తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ కావడంతో వారు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని టిడిపి నాయకులు వ్యాఖ్యానించారు. పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజల అవసరాలను గుర్తించి, నేరుగా మద్దతు అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది.