కల్లూరు అర్బన్ 19వ వార్డు నజర్ కాలనీ, భ్రమరాంబ మల్లికార్జున నగర్‌లో రూ. 91. 45 లక్షల రూపాయలతో సీసీ డ్రెయిన్లు, డబ్ల్యూబీఎం రోడ్, డిస్పోజబుల్ డ్రెయిన్ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులు సమయానికి పూర్తి చేయాలని అధికారులు తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఇతర నేతలు పాల్గొన్నారు.