గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులకు కర్నూలు జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి. చిరంజీవి సూచించారు. గురువారం కల్లూరు మండలంలోని పెద్దటేకూరు, బస్తిపాడు లేఅవుట్లను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు. అదనంగా ఎస్సీలకు రూ.75,000, బీసీలకు రూ.50,000, మగ్గం కార్మికులకు రూ.50,000, చెంచులకు రూ. 1 లక్ష మంజూరు చేసినట్టు, లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.