రాష్ట్రంలో రూ. 4.96 లక్షల పెట్టుబడులతో 76 ప్రాజెక్టులు, 4.51 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. శనివారం కల్లూరు సభలో సీఎం మాట్లాడుతూ సంక్షేమానికి అంకితంగా, పెట్టుబడులకు ప్రోత్సాహంగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఉచిత బస్సులు, రూ. 15వేలు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్లు, అన్న క్యాంటీన్లు పేదల జీవితాల్లో మార్పు తేనున్నాయని వెల్లడించారు.