రాయలసీమను సస్యశ్యామలం చేయడమే తన ముఖ్య లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం కల్లూరు ప్రజావేదికపై సీఎం మాట్లాడుతూ సీమలో తాగునీటి, సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బానకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయడం తన జీవిత లక్ష్యమని తెలిపారు. రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించడంతో పాటు వ్యవసాయం అభివృద్ధి చెందేలా చేయడం తాను చేపట్టిన ప్రధాన ప్రాజెక్టుల లక్ష్యమన్నారు.