పాణ్యం నియోజకవర్గం మహిళలు ఒక న్యూస్ ఛానల్ పై మంగళవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మహిళలను అవమానపరిచే భాష ఉపయోగించిన ఛానల్ సిబ్బంది, కొమ్మినేని, వైసీపీ జర్నలిస్టు కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ నాయకురాలు శైలజ యాదవ్, వసుంధర డిమాండ్ చేశారు. కల్లూరు అర్బన్ పరిధిలోని మధవి నగర్ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆడబిడ్డలకు వైయస్ భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు.