ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామ శివారులో ఆదివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. బైక్ పై నాటుసారా తరలిస్తున్న గుడుంబాయి తాండకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 15 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.