కేతవరం: రోడ్డు పనులు మొదలు చేయకపోతే రహదారిని దిగ్బందిస్తాం

80చూసినవారు
ఓర్వకల్లు మండలం కేతవరం నుండి గార్గేయపురం వరకు, పూడిచెర్ల మెట్ల రోడ్డు పనులు ప్రారంభించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం కేతవరంలో ప్రజాసంఘాల నాయకులతో కలిసి రోడ్డును పరిశీలించిన వారు మాట్లాడుతూ గత ఆరు నెలలుగా పనులు ఆగిపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులు ప్రారంభించకపోతే జాతీయ రహదారిని దిగ్బందిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్