కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన మెడికల్ క్యాంపుకు వాకర్స్, క్రీడాకారుల నుండి మంచి స్పందన లభించింది. మెడిహబ్ యాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపులో బరువు, బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించి వెంటనే ఫలితాలు అందజేశారు. కార్యక్రమంలో ఓబులేసు, ఉదయ్ కుమార్, నందిని, మానస, వినోద్ తదితరులు పాల్గొన్నారు.