కల్లూరు మండలం తడకనపల్లె శివారులో ఏరువాక పౌర్ణమి సందర్భంగా బుధవారం రైతు జగన్నాథం పొలంలో ఉల్లి విత్తనం వేస్తూ జిల్లా ఇంచార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అరక పట్టి పొలం దున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పాల్గొన్నారు. రైతులతో మమేకమైన ఉత్సాహం నింపిన నేతల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.