మీదివేములలో ఎమ్మార్పీఎస్ కీలక సమావేశం

53చూసినవారు
ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ కీలక సమావేశం జరిగింది. శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి దుమ్ము చిన్నమాదిగ, జిల్లా అధ్యక్షుడు భాస్కర్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జూలై 7న ప్రతిగ్రామంలో మాదిగలు ఐక్యంగా ఉండి ప్రతి గ్రామంలో పండగ వాతావరణంలో జెండా ఆవిష్కరణ, 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుగా నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామ నాయకులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్