ఓర్వకల్లు మండలంలో స్థానికులకు 85% ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగాలు కల్పించని పరిశ్రమల భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్ పేరుతో రైతుల నుంచి 30 వేల ఎకరాల భూమి సేకరించిందన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు శివ కుమార్, ప్రసాద్, శేఖర్, హరి పాల్గొన్నారు.