ఓర్వకల్ మండలంలోని గ్రీన్ కో కంపెనీలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలకు మంగళవారం మత్తు పదార్థాలపై ఈగల్ టీం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈగల్ ఇన్‌చార్జ్ ఆకే రవికృష్ణ ఆదేశాలతో ఈగల్ ఎస్సై సుజన్ కుమార్, ఓర్వకల్ ఎస్సై సునీల్ కుమార్, ఎక్సైజ్ సీఐ సుభాషిణి పాల్గొని గంజాయి వాడకం వల్ల ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరిస్థితిపై వచ్చే దుష్ప్రభావాలను వివరించారు. వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.