ఓర్వకల్లు: నాటు సారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

57చూసినవారు
ఓర్వకల్లు: నాటు సారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్
ఓర్వకల్లు మండలం కాల్వ శివారులో ఆదివారం జరిగిన వాహన తనిఖీల్లో 15 లీటర్ల నాటుసారా పట్టుబడింది. బైక్‌పై అక్రమంగా తరలిస్తున్న గుడుంబాయి తాండకు చెందిన వ్యక్తిని ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేశారు. ఈ తనిఖీలు ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ నేతృత్వంలో జరిగాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించారు.

సంబంధిత పోస్ట్