ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

66చూసినవారు
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తమ ఊరిలో దేవర ఉత్సవాలకు బంధువులను పిలిచేందుకు వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. చరణ్ (16) అక్కడికక్కడే మృతి చెందగా, మునిరంగస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. గస్తీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన యువకుడిని 108లో కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్