ఓర్వకల్లు: పెండింగ్ ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించండి

65చూసినవారు
ఓర్వకల్లు మండలంలో మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేశారు. ప్రతి కుటుంబానికి పనిముట్లు, పారా, చలికే గంప ఇవ్వాలని, 200 రోజులకు రూ. 600 కూలీ కల్పించాలని వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్