ఓర్వకల్లు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం యోగాంధ్ర డెమో కార్యక్రమం నిర్వహించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పిలుపు మేరకు డ్వామా పీడీ వెంకటరమణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు నేతృత్వంలో యోగా, ప్రాణాయామ కార్యక్రమాలు జరిగాయి. 21న యోగా డే సందర్భంగా అన్ని శాఖల సిబ్బంది తప్పక హాజరు కావాలని పీడీ సూచించారు.