ఓర్వకల్లు మండలంలోని దళితుల స్మశాన వాటికల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి బి. నాగన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఓర్వకల్లులో ఆయన మాట్లాడుతూ మండలంలోని స్మశాన వాటికల్లో కంప చెట్లు, బండరాళ్ల వల్ల శవాలు పూడ్చడంలో తీవ్ర అవాంతరాలు ఎదురవుతున్నాయని విమర్శించారు. వెంటనే ముళ్లపొదలు తొలగించి, గుంతలు దిగేలా మట్టిని త్రవ్వాలని గ్రామపంచాయతీలను డిమాండ్ చేశారు. లేకపోతే నిరసనలకు సిద్ధమని హెచ్చరించారు.