పాణ్యం: రైతుల హక్కుల కోసం ఏఐకేఎస్ నిరంతరం పోరాటం

75చూసినవారు
ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఓర్వకల్లు మండల నన్నూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్. మధుసూధన్ జెండా ఆవిష్కరించి, మాట్లాడారు. ఏఐకేఎస్ రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాలకు 90 శాతం సబ్సిడీ, రైతుల రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్