2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం లక్ష్యాలు కేటాయించిందని ఓర్వకల్లు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలో అర్హులు ఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా మే 10 తేదీలోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సహాయం పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసులు సూచించారు.