పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలోని గని, మంచాలకట్ట, ఉండుట్ల గ్రామాల్లో వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బుధవారం రైతులకు సిసిఆర్సి సదస్సులు నిర్వహించాయి. పంట సాగుదారులకు కౌలు కార్డు లాభాలు, దరఖాస్తు విధానంపై మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి వివరించారు. కౌలు కార్డు ద్వారా రైతులు ఎంఎస్పీ, విత్తన సబ్సిడీ, పంట బీమా, రుణ సదుపాయాలు పొందవచ్చని తెలిపారు. అర్హులు వీఆర్వో సమక్షంలో పూర్తి సమాచారం సమర్పించాలని సూచించారు.