పాణ్యం నియోజకవర్గంలోని గోరుకల్లు రిజర్వాయర్ రాతిపరుపు కుంగిన ప్రాంతాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని సీడీవో నిపుణులు సూచించారు. మంగళవారం ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీ ప్రతినిధులు రిజర్వాయర్‌ను పరిశీలించారు. నీటి ఒత్తిడితో రివిట్‌మెంట్ కింద ఖాళీ ఏర్పడి రాతిపరుపు కుంగినట్లు సీఈ విజయభాస్కర్ బృందం తెలిపారు. మట్టికట్ట, నీటి నిల్వ, మ్యాపులు పరిశీలించి పునర్నిర్మాణ సూచనలు ఇచ్చింది.