పాణ్యం నియోజకవర్గంలో బాబు షూరిటీ - మోసం గ్యారెంటీ అనే విస్తృతస్థాయి సమావేశం శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్లమెంట్ పరిశీలకురాలు కల్పలత రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలకు వివరించాలని సూచించారు.