కల్లూరు అర్బన్ పరిధిలోని 23వ వార్డు శ్రీరామ నగర్ లో ఆదివారం సిపిఎం పార్టీ నాయకులు నరసింహులు, జనార్ధన్ రావు పర్యటించారు. వార్డు ప్రజలు డ్రైనేజీ సమస్య, గుంతలతో నాణ్యత లేని సీసీరోడ్లపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాలనీలోని డ్రైనేజీ కాలువ నిండిపోయి దుర్గంధంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్న ఆధికారులు పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు.