పాణ్యం మండలంలోని తమ్మరాజుపల్లె గ్రామం వద్ద శుక్రవారం జాతీయ రహదారిపై స్లాగ్ లారీ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కర్నూలు నుండి నంద్యాల వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడడంతో అతన్ని చికిత్స కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. హైవే పోలీసులు ప్రమాదానికి గురైన తీరును పరిశీలించారు.