నేషనల్ గ్రీన్ కోర్, జిల్లా విద్యాశాఖ ఆధికారి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యంలోని పాణికేశ్వర ఆలయ పరిసరాలను 150 మంది విద్యార్థులు శుభ్రపరిచారు. గురువారం పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి హజరై, విద్యార్థులకు సమాజ సేవ, పర్యావరణ సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ, గిరిజన పాఠశాలల విద్యార్థులు, పాల్గొన్నారు.