పాణ్యం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కోసం మంగళవారం మాజీ ఎమ్మెల్సీ, మాజీ రాయాలసీమ రేంజ్ ఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ రూ. 74 వేల రూపాయలతో రేకుల షెడ్డు నిర్మించారు. విద్యార్థులు ఎండలో భోజనం చేయకూడదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్మాణం పూర్తి కాగా, హెచ్ఎం సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ సురేంద్ర, సుబ్రహ్మణ్యం, తదితరులు ఉన్నారు.