గడివేముల మండలం పెసరవాయి గ్రామ సచివాలయంలో శుక్రవారం గ్రామ పంచాయతీ సెక్రెటరీ నాగేష్, సర్పంచ్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గ్రామ సభకు ప్రజలు గ్రామంలో ఉన్న తమ సమస్యలను అధికారులు ఎదుట తెలియజేశారు. ఆరోగ్య, విద్య, నీటి సమస్యలపై చర్చ జరిగింది. తల్లికి వందనం, రేషన్ ఈకేవైసీ, జనన మరణ ధ్రువపత్రాల ప్రక్రియపై అవగాహన కల్పించారు. సర్పంచ్, సెక్రటరీ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.