ఓర్వకల్లు మండల వ్యవసాయ అధికారి గురువారం సుధాకర్ మాట్లాడుతూ, కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు గుర్తింపు కార్డులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డులు సబ్సిడీ విత్తనాలు, పంట బీమా, కనీస మద్దతు ధర పంట నష్టపరిహారం వంటి ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగిస్తాయని వివరించారు. మండలానికి 1250 కార్డుల లక్ష్యం ఉండగా, రైతులు తమ గ్రామ VRDO లేదా సేవా కేంద్రంతో సంప్రదించాలని కోరారు.