పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ చంద్రబాబు నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. మృతులు జానకి(60), విహారిక (4)గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.