ప్రేమకు ఎల్లలు లేవంటారు. కర్నూలు అబ్బాయికి, జపాన్ అమ్మాయికి ప్రేమ చిగురించింది. కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఉంటున్న కీర్తి కుమార్, జపాన్ టోక్యోకు చెందిన మట్ సుమోంటో రింకతో మూడున్నర ఏళ్ల ప్రేమ సంబంధం తరువాత పెళ్లి చేసుకున్నారు. శనివారం కర్నూలులోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చిలో ఫాదర్లు డి. ప్రసాదరావు, పుష్పాలలితలు వివాహం నిర్వహించారు. ఈ పెళ్లికి జపాన్ నుంచి బంధుమిత్రులు హాజరయ్యారు.