పాణ్యం: భూపనపాడు గ్రామంలో చెరువులో బొనిగెని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గల్లంతైనట్లు మంగళవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల. అదే గ్రామానికి చెందిన బొనిగెని వెంకటేశ్వర్లు 13వ తేదీన ఓ వ్యక్తితో కలిసి చెరువు వద్దకు వెళ్లిన, ఆతర్వాత అతడు తిరిగి రాలేదు. రెండు రోజులుగా గాలించినా ఎటువంటి సమాచారం లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.