విజయవాడ సచివాలయంలో నీటి పారుదల మంత్రి నిమ్మల రామానాయుడును పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కలిశారు. మంగళవారం ఆమె మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడారు. పాణ్యం నియోజకవర్గంలోని ముఖ్యమైన ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మలతో చర్చించారు. నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు.