పాణ్యం: పెండింగ్‌లోని ఉపాధి నిధులు తక్షణమే విడుదల చేయాలి

63చూసినవారు
పాణ్యం: పెండింగ్‌లోని ఉపాధి నిధులు తక్షణమే విడుదల చేయాలి
పెండింగ్‌లో ఉన్న ఉపాధి నిధులు తక్షణమే విడుదల చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న డిమాండ్ చేశారు. బుధవారం ఓర్వకల్లు మండలం కొంతలపాడులో ఉపాధి పనులను పరిశీలించి, కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలను పొమ్మనకుండా పొగ పెట్టిన విధంగా 6 వారాలైనా కూలీ డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా చర్యలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్