కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకంపై ఓర్వకల్లు అధికారులు అవగాహన కల్పించారు. బుధవారం మండలంలోని పూడిచెర్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శేషాద్రి ఇళ్లల్లో వినియోగించే విద్యుత్, సోలార్ కు సంబంధించిన రాయితీలను వివరించారు. పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగాను, ఇతరులకు రాయితీలపై విద్యుత్ ను సరఫరా చేయనున్నట్లు చెప్పారు.