గోరుకల్లు రిజర్వాయర్ పనులను యుద్ధ పాదప్రధికంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాణ్యం తహసీల్దార్ ఆఫీసు ఎదుట రాయలసీమ సాగునీటి సాధన సమితి అద్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మత్తులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని తహశీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మూడు లక్షల ఎకరాల ఆయకట్టు, లక్షలాది ప్రజల జీవితం ప్రమాదంలో పడుతుందన్నారు.