గడివేముల మండలం కొరపూరులో రీసర్వేపై గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం డీటీ హరికృష్ణ, సర్వేయర్ మధు సమాధానం చెప్పకుండా కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో 680 ఎకరాల భూమిని ఇతర గ్రామాల వారికి పాసుపుస్తకాలుగా ఇవ్వడంపై గ్రామ సర్పంచ్ మాలిక్ భాష, ప్రజలతో కలిసి మాట్లాడారు. కాగా సమస్యలపై అర్జీలు అందజేస్తే పరిష్కరిస్తామని ఆధికారులు సమాధానం ఇచ్చారు.