సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. సోమవారం కల్లూరులోని ఆమె నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన రూ. 17, 77, 138 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జారెడ్డి పురుషోత్తం రెడ్డి రూ. 3. 50 లక్షలు, చంద్రకళాకు రూ. 1. 18 లక్షలు, నాగేశ్వరికి రూ. 75, 900 చెక్కును అందజేశారు. అనేక మంది రోగులు, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిందని తెలిపారు.