ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు మైనింగ్ డీడీ రవిచంద్ హెచ్చరించారు. బుధవారం కల్లూరు మండలం తడకనపల్లి గ్రామ పరిధిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న పాంత్రాలను అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రావెల్ ను అక్రమంగా తవ్వుతున్న 2 పోక్లైన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మట్టి తరలిస్తున్న 2 లారీలు, 2 కంకర టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు.