స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్లో ఉన్న 20 నెలల జీతాలు విడుదల చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామ స్వచ్ఛ భారత్ కార్మికులతో కలిసి కలెక్టర్ ఆఫీస్ ఏవోను కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. స్వచ్ఛభారత్ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని విమర్శించారు.