కల్లూరు అర్బన్ పరిధిలోని గోవర్ధన్ నగర్‌లో పూర్తయిన రైతు బజారును వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రాముడు కోరారు. శుక్రవారం మార్కెట్ యార్డ్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు, ఏడీఎం నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి ని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రైతు బజార్ ఆలస్యం వల్ల వృధా అవుతుందని, గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. త్వరలో ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.