తిరుపతి తొక్కిసలాట ఘటన అత్యంత బాధాకరమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. గురువారం ఆమె కల్లూరులో ఈ ఘటనపై మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి తిరుపతికి వచ్చిన భక్తులు కూడా మృత్యువాత పడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.