పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఉన్న గాలేరు నగరి వద్ద కాల్వలో పడి బుధవారం ఓ బాలుడు మృతి చెందాడు. చెంచుకాలనీలో నివాసముంటున్న అంకన్న కుమారులతో కలిసి చేపలు పట్టుకునేందుకు వలలు వేశాడు. వాటిలో చేపలుపడ్డాయా, లేదా? అని చూసేందుకు వెళ్లిన పెద్ద కుమారుడు వీరయ్య (13) జారిపడి కాల్వలో పడ్డాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకోపోయాడు. తండ్రి గజ ఈతగాళ్ల సహాయంతో బాలుడిని బయటకు తీయగా, అప్పటికే మృతి చెందాడు.