పాణ్యం: అకాల వర్షంతో అరటి పంటకు భారీ నష్టం

77చూసినవారు
పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలో అకాల వర్షం కురిసింది. సోమవారం కాల్వ గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పొలాల్లోని విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అరటి పంట నెలకొరిగింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గాలివాన బీభత్సానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, కరెంట్ ఎప్పుడు వచ్చేది తెలియదని విద్యుత్ సరఫరా మరమ్మతులు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్