రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ఓర్వకల్లు మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్టిని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎస్సీ బాలికల హాస్టల్ లో డాక్టర్. బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.