కల్లూరు మండలం ఉలిందకొండను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం ఉలిందకొండలో పర్యటించిన ఆమె మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉలిందకొండలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. టీడీపీ నేత రమణ మాట్లాడుతూ గౌరు దంపతుల సహకారంతో రూ. 5 కోట్ల నిధులతో ఉలిందకొండను ఆదర్శ గ్రామంగా తయారు చేసుకుందామని అన్నారు.