కల్లూరు మండల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు ఎంపీడీవో నాగశేషాచలరెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ ఆంజనేయులు, ఉన్నారు.