హమాలీల కూలి రేట్లు పెంచాలని మంత్రికి వినతి

65చూసినవారు
హమాలీల కూలి రేట్లు పెంచాలని మంత్రికి వినతి
కర్నూలు జిల్లాలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోడౌన్ లో పనిచేసే హమాలీల కూలి రేట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కర్నూలులో మంత్రి టీజీ భరత్ ను కలిసి వినతిపత్రం అందించి, మాట్లాడారు. ప్రస్తుతం అమలవుతున్న కూలి రేట్ల ఒప్పందం గతేడాది డిసెంబర్ నాటికే ముగిసిందన్నారు. క్వింటా రూ. 25 నుంచి రూ. 40కి పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్