కూటమి ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తయ్యిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వివరించారు. బుధవారం తడకనపల్లెలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్ల పునరుద్ధరణ, పెన్షన్లు, విద్య, గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు సేవలు, తల్లి వందనం పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌కు రూ. 2800 కోట్ల నిధులు మంజూరు చేయబడినట్లు వెల్లడించారు.